నిజంనిప్పులాంటిది

May 26 2023, 09:41

సెల్లార్ లో పాప మృతి కేసులో ఓ మహిళ ఎస్సై నిర్లక్ష్యం

హైదరాబాద్‌: హయత్‌నగర్‌‌లోని ఓ సెల్లార్‌లో పాప మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారును నిర్లక్ష్యంగా నడుపుతూ పాప మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నిన్న హయత్‌నగర్‌ లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పడుకోబెట్టిన రెండున్నర ఏళ్ల పాప మీది నుంచి కారు వెళ్లగా.. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది.

అయితే.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.

పాప మృతికి కారణమైన కారు వివరాలను పోలీసులు గుర్తించారు. TS07 JR 9441 నెంబరు గల కారు.. లెక్చరర్స్ కాలనీ బాలాజీ ఆర్కేడ్ నాలుగో ఫ్లోర్ రెసిడెన్స్‌ అడ్రస్‌తో.. కేషమోని స్వప్న పేరుతో రిజిస్టర్ అయింది.

అయితే స్వప్న.. ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో పోలీస్ క్యాప్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే.. కారును నడిపింది మాత్రం ఎస్సై స్వప్న భర్త హరిరామకృష్ణగా పోలీసులు గుర్తించారు. దీంతో.. ఎక్సైజ్ ఎస్సై స్వప్న భర్త హరిరామకృష్ణను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. హరిరామకృష్ణపై కేసు పెట్టకుండా పోలీసులు కేవలం సీఆర్పీసీ 41 నోటీసులిచ్చి పంపించేశారు. అయితే.. హరిరామకృష్ణను అరెస్ట్‌ చేయకుండా కేవలం నోటీసులిచ్చి పంపించటంపై పాప కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరిరామకృష్ణను అరెస్ట్‌ చేయాలంటూ పాప తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

పాపను చూడకుండా హరిరామకృష్ణ నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా తెలుస్తోంది. అయినా కూడా పోలీసులు హరిరామకృష్ణను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చి పంపించారంటూ పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాప హత్యకు కారణం అయిన హరిరామకృష్ణను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 26 2023, 09:36

Avinashreddy: అవినాష్‌రెడ్డి ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది..

ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:58

మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర

మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్‌ ధర చేసింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటోంది.

రిజర్వేషన్ల విషయంలో రేగిన వివాదం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక ఆందోళనలకు దారితీసింది. మూడు వారాల నుంచి మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.

ఇతర రాష్ట్రాల నుంచి మణిపూర్‌కు ట్రక్కులు నడిపేందుకు యజమానులు, డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో నిత్యావసర వస్తువులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది.

దీంతో అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు.

వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్‌ ధర రూ.1800లకు పైకి చేరిందని వాపోయారు.

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:56

గ్రూప్-1 పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ నిర్వహణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ‌ హైకోర్టు

నిరాక‌రించింది. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాదాపు 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

గ్రూప్-1, 2, 3, 4 నియామక పరీక్షలకు మధ్య 2 నెలల వ్యవధి ఉండాలన్న నిబంధనను టీఎస్పీఎస్సీ పాటించలేదని ఆయా అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అయితే.. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ విచారణ నిర్వహించింది. అయితే.. తన కుమార్తె కూడా గ్రూప్ 1 అభ్యర్థి అయినందున తాను విచారించలేనని జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ పేర్కొన్నారు. పిటిష‌న్‌ను మ‌ధ్యాహ్నం మ‌రో బెంచ్‌కు పంపిస్తాన‌ని తెలిపారు.

దీంతో ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌స్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది.

ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్, కార్య‌ద‌ర్శి, హోం శాఖ కార్య‌ద‌ర్శి, సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మరో నాలుగు వారాల‌కు హైకోర్టు వాయిదా వేసింది...

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:55

హయతికి వేధింపులు: డీసీపీపై లాయర్ పాల్ సత్యనారాయణ సంచలన ఆరోపణలు

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై కేసులో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, డింపుల్ తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. డింపుల్ హయతిపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. డింపుల్.. డీసీపీ కారు కవర్ తీసేసిందని ఎఫ్ఐఆర్ లో రాశారని, నిజంగా డింపుల్ తొలగించినట్టు ఫుటేజ్ ఉంటే బయటపెట్టండని సవాల్ విసిరారు ఆమె తరుపు న్యాయవాది పాల్ సత్య నారాయణ. ఈ వివాదంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

డీసీపీ అబద్దాలు చెబుతున్నారరన్నారు పాల్ సత్యనారాయణ. తన డ్రైవర్‌ను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నాడని.. ఇంత జరుగుతున్నా డ్రైవర్ ఎందుకు బయటకు రావడంలేదని ప్రశ్నించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్స్, ట్రాఫిక్ పోలీసులు కావాలనే బ్రిక్స్ తీసుకొచ్చి పార్కింగ్‌‌లో పెట్టారని.. చేసిన తప్పును కవర్ చేసుకునేందుకే ఇదంతా చేశారని న్యాయవాది పాల్ ఆరోపించారు.

డీసీపీ ప్రవర్తన బాగాలేకనే డింపుల్ గతంలో ఆయనకు వార్నిం కూడా ఇచ్చిందని.. ఆ కోపంతోనే డింపుల్‌పై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు లాయర్ సత్య నారాయణ. ఇక డింపుల్ ఇంట్లోకి కూడా ఎవరెవరో వస్తున్నారని, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ చేసి ఆమెను భయపెడుతున్నారని.. భయంతో ఆమె బయటకు కూడా రావడంలేదని చెప్పుకోచ్చారు. దీనిపై డింపుల్ ఫిర్యాదు చేస్తే కూడా తీసుకోవడం లేదని ఆయన వెల్లడించారు.

ఒక ఐపీఎస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమేనన్న పాల్ సత్యనారాయణ.. డీసీపీతో పాటు అతని డ్రైవర్ పైన న్యాయ పరమైన యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. కాగా, ఐపీఎస్‌ అధికారి రాహుల్ హెగ్డే, డింపుల్ హయతికి మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. డీసీపీ డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్‌పై కేసు కూడా నమోదైంది. డింపుల్ హయతి నివాసం ఉంటున్న భవనంలోనే ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. మరోవైపు, డింపుల్ కూడా డీసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

నిజంనిప్పులాంటిది

May 25 2023, 19:53

వరకట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు? తెలంగాణలో అమలు కానుందా❓️

ఆడపిల్లలను కన్నవారు అల్లుడికి వరకట్నం ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారంగా కొనసాగుతుంది. పెళ్లిలో కచ్చితంగా ఎంతో కొంత నగదును వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఇస్తారు.

అయితే ఇటీవల హైకోర్టు విడాకుల విషయం సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం వరకట్నం తీసుకునేవారికి డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా, తెలంగాణలో కూడా ఈ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ కేరళ వరకట్న వ్యతిరేక విధానాన్ని అధ్యయనం చేశారు.

రెండేళ్ల కిందటే కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదన సమర్పించారు.

ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదనను అవసరమైన ప్రోటోకాల్‌లను పరిశీలిస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది...

నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:49

నేడు సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం

హాజరుకానున్న అన్ని శాఖల మంత్రులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్‌ కమిషనర్లు పాల్గొననున్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని శాఖల మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని ఆహ్వానించారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.

నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:47

వానాకాలం పంటల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన అధికారులు

•జిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో సాగు అంచనా

జనగామ:

వానాకాలం పంటల ప్రణాళిక ఖరారైంది. జిల్లాలో 2023-24 ఖరీ్‌ఫకు సంబంధించిన పంటల అంచనా సాగు విస్తీర్ణం, అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో నేల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అయ్యే అవకాశం ఉందనే దాన్ని బట్టి మండలాల వారీగా ప్లానింగ్‌ తయారు చేశారు. జూన్‌ నెలతో వానాకాలం సీజన్‌ ప్రారంభం అవుతున్న తరుణంలో యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేశారు.

అన్ని రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 3.76 లక్షల ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ సీజన్‌ నుంచి వానాకాలం, యాసంగి సీజన్‌లను ముందుకు జరపాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వడగండ్ల వాన కురిసి పంటలకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో ముందస్తుగా నాట్లు వేయించి, ముందస్తుగా కోతలు కోయించేలా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌ నుంచే నిర్ణయాన్ని అమలు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జూన్‌ 15లోగా నాట్లు వేసేలా..

యాసంగి సీజన్‌లో వడగండ్ల వల్ల కలిగే నష్టాన్ని తప్పించాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం సీజన్లను ముందుకు జరపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలను సైతం జారీ చేసింది. దీంతో గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు రైతులకు ఆ దిశగా అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్‌లో వరి నాట్లు జూలై నెలలో ప్రారంభించి సెప్టెంబరు వరకు వేస్తారు. దీంతో వానాకాలం కోతలు ఆలస్యమై యాసంగి నాట్లు కూడా ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి.

ఈ క్రమంలో యాసంగి కోతలు మే నెల వరకు జరుగుతున్నాయి. దీంతో మార్చి, ఏప్రిల్‌ నెలలో సరిగ్గా వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో వడగండ్లు పడి తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అధిగమించేందుకు ముందస్తుగా నాట్లు వేయించాలని అధికారులు చూస్తున్నారు. జూన్‌ 15లోగా నారు పోసుకొని జూలై 15లోగా నాట్లు పూర్తి చేసేలా చూస్తున్నారు. అదే విధంగా యాసంగి సీజన్‌లో నవంబరు 15లోగా నారు పోసుకొని డిసెంబరు 15 లోగా నాట్లు పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అనుకూల రకాలపై కసరత్తు

సీజన్‌ను ముందుగా ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా నేలల స్వభావాన్ని బట్టి అవసరమయ్యే కొత్త రకాలను తెప్పించే పనిలో అధికారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీజన్‌ను ముందుగా ప్రారంభిస్తున్నందున ఏ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఏయే రకాలు అవసరమవుతాయనే దానిపై రాష్ట్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత రానున్నట్లు తెలిసింది. దీంతో జనగామ జిల్లాకు సంబంధించి ఏయే రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయన్న దానిపై క్లారిటీ రానుంది. యాసంగి సీజన్‌లో నవంబరులో నారు పోసుకోవడం వల్ల చల్లి తీవ్రత కారణంగా నారు ఎదగదని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏ రకాలు అయితే అనుకూలంగా ఉంటాయో అవే రకాలను తెప్పించాలని అధికారులు భావిస్తున్నారు....

నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:44

ముంబై ని ఒంటి చేత్తో గెలిపించాడు : ఎవరి ఆకాష్

ప్లే ఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్. లక్నో జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్. దీంతో చాలామంది ముంబయి గెలుస్తుందని అనుకున్నారు. అనుహ్యంగా టాపార్డర్ సాధారణ స్కోర్లకే పరిమితమైంది. నవీన్ ఉల్ హక్ ఏకంగా 4 వికెట్లు తీశాడు. అయినాసరే ముంబయి ఎలాగోలా 182/8 స్కోరు చేసింది. ఒక్కసారి కుదురుకుంటే లక్నోకి ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదని అందరూ అనుకున్నారు. సరిగా ఇలాంటి టైంలో ఓ కుర్రాడు మాయ చేశాడు. రోహిత్, సూర్య, తిలక్ వర్మ కాదు.. తానున్నానంటూ బులెట్ లాంటి బంతులేశాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించాడు. ముంబయి క్వాలిఫయర్-2కి వెళ్లేలా చేశాడు. అసలు ఎవరీ కుర్రాడు? ఇతడికి రిషభ్ పంత్, బుమ్రాతో సంబంధమేంటి?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నా బౌలింగ్ మాత్రం తేలిపోయింది. బుమ్రా లేడు. ఆర్చర్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అతడి స్థానంలో వచ్చిన జోర్డాన్ కూడా పరుగులిచ్చేస్తున్నాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ లోనూ బౌలింగ్ కష్టమే అనుకున్నారు. ఇలాంటి టైంలో ఆకాష్ మద్వాల్ తన సత్తా చాటాడు. రెండేళ్లుగా జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. అసలు ఎవరీ కుర్రాడు అనుకోవచ్చు. చెప్పాలంటే ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ ని ఆ జట్టు సొంతగడ్డపై కట్టడి చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ సేమ్ ఇలానే అడ్డుకున్నాడు. ఈ రెండింటిలోనూ ముంబయి బ్యాటర్లు ఛేజ్ చేసి గెలవడంతో ఆకాష్ కి పెద్దగా పేరు రాలేదు. లక్నో మ్యాచ్ లో మాత్రం అలా జరగలేదు.

ఈ మ్యాచ్ లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. నామమాత్ర స్కోరు చేసింది. దీంతో బౌలర్లపై భారం పడింది. దీంతో ఆకాష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా లేని లోటుని పూడ్చేశాడు. లక్నో జట్టులో ఫామ్ లో ఉన్న ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ ని వరస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్ గా 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి, 5 వికెట్లు తీసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు.

అసలు మ్యాటర్ చెప్పలేదు.. పాయింట్ కి రా అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. టెన్నిస్ బాల్ క్రికెట్ తో ఆకట్టుకున్న ఆకాష్ ని.. మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలుత గుర్తించాడు. సరైన కోచింగ్ ఇచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకున్న ఇతడు.. పేస్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెరీర్ పరంగా క్రికెటర్ అయినప్పటికీ.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పక్కింట్లోనే ఆకాష్ ఉండేది. వీళ్లిద్దరూ అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు. పంత్ దిల్లీకి మారిపోతే.. ఆకాష్ మాత్రం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోయాడు. ఈ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్ ఆకాష్ కావడం మరో విశేషం. 2021లో ఆర్సీబీలో నెట్ బౌలర్ గా ఉన్న ఆకాష్ ని ఆ జట్టు గుర్తించలేకపోయింది. దీంతో 2022 వేలంలో ఇతడిని ఎవరూ తీసుకోలేదు. సూర్యకుమార్ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాష్ మద్వాల్ ని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ లోనూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కి అతడిని అట్టిపెట్టుకుంది. అలా పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం మర్చిపోకుండా ఆకాష్.. ఇప్పుడు తన జట్టుకు సహాయపడ్డాడు. నెక్స్ట్ బుమ్రాగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సో అదనమాట విషయం...

నిజంనిప్పులాంటిది

May 25 2023, 10:41

ఈ రోజే టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్ 2023 ప్ర‌వేశ ప‌రీక్ష‌

టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్‌-2023 ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను గురువారం 25 న నిర్వ‌హించనున్న‌ట్లు టీఎస్ లాసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

మూడేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు రెండు సెష‌న్ల‌లో నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి సెష‌న్‌ను ఉద‌యం 9:30 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్‌ను మ‌ధ్యాహ్నం 12:30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థుల‌కు మూడో సెష‌న్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించనున్నారు

మొద‌టి, రెండో సెష‌న్ల‌కు తెలంగాణ‌లో 60, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 4 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

మూడో సెష‌న్‌కు తెలంగాణ‌లో 41, ఏపీలో 4 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజ‌రు కానున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సుల‌కు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

హాల్ టికెట్‌లో పొందుప‌రిచిన అంశాల‌ను ప్ర‌తి అభ్య‌ర్థి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని క‌న్వీన‌ర్ సూచించారు....